కూటమి నాన్‌లోకల్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి నాన్‌లోకల్‌

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

కూటమిని నమ్మడం లేదు

సాక్షి, భీమవరం: సూపర్‌సిక్స్‌ హామీలకు ఎగనామం, పాలన వైఫల్యంతో చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత, వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న జనాదరణ స్థానిక పరిషత్‌ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఎన్ని కుట్రలు చేసిన, రూ.కోట్లు ఖర్చుపెట్టి ఓటర్లకు ప్రలోభాలు ఎరవేసినా పలుచోట్ల పరాభవం, ఊహించని స్థాయిలో వైఎస్సార్‌సీపీ నుంచి గట్టిపోటీ ఎదురుకావడం కూటమిని కలవరపరుస్తోంది.

కూటమి వైఫల్యాలతో..

కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు గడుస్తోంది. సూపర్‌సిక్స్‌లోని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ హామీలు ఇప్పటివరకు పత్తాలేవు. పేదలకు సెంటు స్థలం పంపిణీ చేయలేదు. కొత్త పింఛన్‌ ఒక్కటీ ఇవ్వలేదు. గృహనిర్మాణ సాయం మంజూరు చేసిందిలేదు. సంక్షేమం పడకేసింది. రోడ్లు అభివృద్ధి ప్యాచీ వర్కులతో సరిపెట్టారు. మరోపక్కనిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. బియ్యం 26 కిలోల బస్తా రికార్డు స్థాయిలో రూ.2,200 దాటిపోయింది. పప్పులు, నూనెల ధరలూ ఆకాశన్నంటుతుండగా వీటి ప్రభావం పరిషత్‌ ఎన్నికల్లో కనిపించింది.

దిమ్మతిరిగే ఫలితాలు

జిల్లాలో 20 జెడ్పీటీసీ, 340 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగ్గా 36 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి పక్షాల ఆధిక్యత గతంతో పోలిస్తే పలుచోట్ల భారీగా తగ్గింది. ఆ మేరకు వైఎస్సార్‌సీపీకి పోలింగ్‌ శాతం పెరిగింది. ఎంపీటీసీ స్థానాలను కూటమి చాలాచోట్ల కేవలం ఒకటి నుంచి వందలోపు వ్యత్యాసంతో గెలుపొందడం గమనార్హం. ఉదాహరణకు పాలకొల్లు రూరల్‌ జిన్నూరు–1లో నాలుగు ఓట్లు, ఆగర్రులో ఐదు, చించినాడలో తొ మ్మిది, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కడియద్దలో కేవలం ఒకే ఒక్క ఓటు, కొండేపాడులో ఐదు ఓట్లు, పెనుమంట్ర మండలం మార్టేరు–2లో ఆరు ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది. రీకౌంటింగ్‌ పేరిట తాడేపల్లిగూడెం రూరల్‌ కడియద్ద, పెనుమంట్ర మండలం ముళ్లపూడి తదితర చోట్ల కౌంటింగ్‌లో కూటమికి అనుకూలంగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకంగా ఎన్నికలు జరిగి ఉంటే మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గె లుపొందేదని పార్టీ నేతలు అంటున్నారు.

వైఫల్యాలు సుస్పష్టం

పాలనలో విఫలం.. సూపర్‌సిక్స్‌ హామీలకు ఎగనామం

స్థానిక ఎన్నికల్లో కూటమికి ఎదురుదెబ్బ

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా తగ్గిన ఓట్ల శాతం

పారని ప్రలోభాలు, అధికార బలం

బొటాబొటీగా కూటమి గెలుపు

వైఎస్సార్‌సీపీకి పెరిగిన ఆదరణ

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి తాడేపల్లిగూడెం రూరల్‌లో 17,500, పెంటపాడులో 14 వేలు ఓట్లతో రెండుచోట్ల కలిపి 31,500 మెజార్టీ వచ్చింది. జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం రూరల్‌లో 10,828, పెంటపాడులో 11,077 ఓట్లతో మొత్తం 21,905 ఓట్లు మెజార్టీ రావడం గమనార్హం. సాధారణ ఎన్నికలతో పోలిస్తే 9,595 ఓట్ల మెజార్టీ తగ్గింది ఆ మేరకు వైఎస్సార్‌సీపీకి పోలింగ్‌ శాతం పెరిగింది. వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

నరసాపురం రూరల్‌లో సాధారణ ఎన్నికల్లో కూటమికి 15,689 ఓట్ల మెజార్టీ రాగా ప్రస్తుత జెడ్పీటీసీ ఎన్నికల్లో 9,230 ఓట్లకు తగ్గింది.

యలమంచిలి మండలంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి దాదాపు 19 వేలకు పైగా మెజార్టీ రాగా జెడ్పీటీసీ ఎన్నికల్లో 15,416కు తగ్గింది.

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదు. పరిషత్‌ ఫలితాల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. 41 స్థానాలకు ఎనిమిది స్థానాల్లో గెలుపొందాం. స్వల్ప వ్యత్యాసంతో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను కోల్పోయాం. అన్నిచోట్లా గట్టిపోటీ ఇచ్చాం. కూటమి నాయకులు, అధికారులు కుమ్మకై నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఎక్కడికక్కడ దీటైన పోటీ ఇచ్చారు. నియోజకవర్గంలో కూటమికి పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గిన విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

– వడ్డి రఘురాంనాయుడు,

వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement