కూటమి కుట్రలకు చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలకు చెంపపెట్టు

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

కూటమి కుట్రలకు చెంపపెట్టు

వేలేరుపాడులో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం

వేలేరుపాడు: టీడీపీ అరాచకాలు, కుట్రలకు వేలేరు పాడు మండల ఓటర్లు ఎన్నికల రూపంలో సరైన తీర్పునిచ్చారు, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు నిలిచి తగిన బుద్ధి చెప్పారు. వేలేరుపాడు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. జెడ్పీటీసీ అభ్యర్థిగా కుంజా కుమారి తన సమీప టీడీపీ అభ్యర్థిపై 1,149 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండల వ్యాప్తంగా కుమారికి మొత్తం 7,126 ఓట్లు నమోదయ్యా యి. మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 17,600 ఓట్లకు గాను 13,165 ఓట్లు పోలయ్యాయి. రామవరం, మేడేపల్లి స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, కట్కూరు, నార్లవరం, భూదేవిపేట ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తాట్కూరుగొమ్ములో బాడిస వెంకమ్మ 260 ఓట్లు, కట్కూరులో సోడే సురేష్‌ 242 ఓట్లు, నార్లవరంలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ బలపరిచిన సీపీ ఎం అభ్యర్థి ఊకే సరోజిని 242 ఓట్లు, భూదేవిపేటలో కత్తి ఉదయ్‌ కిరణ్‌ 5 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గెలుపును లాక్కునేందుకు కుట్రలు

వేలేరుపాడు మండల ప్రజల తీర్పును జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు అభ్యర్థుల విజయాన్ని రీకౌంటింగ్‌ పేరుతో లాక్కునేందుకు బరితెగించారు. భూదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థి కత్తి ఉదయ్‌ కిరణ్‌ గెలుపు విషయంలో ఇదే తరహా వివాదానికి తెరలేపారు. చెల్లని ఓట్లు పరిశీలించాలంటూ రిటర్నింగ్‌ అధికారిపై గొడవకు దిగారు. కేవలం 5 ఓట్ల మె జార్టీ రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నా చివరకు రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా గెలుపును ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. పోలవరం ముంపు ప్రాంతంలో సైకిల్‌కు పూర్తిగా పంక్చర్‌ పడిందని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement