కౌంటింగ్‌ హాల్‌లో టీడీపీ నాయకుడి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ హాల్‌లో టీడీపీ నాయకుడి హల్‌చల్‌

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

నూజివీడు: స్థానిక సారథి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈనెల 7 జరిగిన పరిషత్‌ ఓట్ల లెక్కింపులో టీడీపీ నాయకుడొకరు హల్‌చల్‌ చేయడం సంచలనంగా మారింది. మండలంలోని పోతురెడ్డిపల్లికి చెందిన అక్కినేని సతీష్‌ అనే నాయకుడు కౌంటింగ్‌ హాల్‌లోకి వెళ్లి ఎంపీడీఓ పక్కనే ఉన్న కుర్చీలో అర గంటకు పైగా కూర్చోవడంతో పాటు ఆ తర్వాత కౌంటింగ్‌ టేబుళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది లెక్కించి కట్టలు కట్టిన బ్యాలెట్‌ పేపర్లను పట్టుకుని పరిశీలించడం, చెల్లని ఓట్లను తీసుకుని చూడటం జరిగింది. సతీష్‌ ఇంతలా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న రిటర్నింగ్‌ అధికారి గాని ఎంపీడీఓ గాని తహసీల్దార్‌ గాని అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. అధికార పార్టీకి అధికారులు ఎంతలా కొమ్ము కాస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం. అంతేగాకుండా కౌంటింగ్‌ చేసిన బ్యాలెట్‌ పేపర్లు తీసి చూస్తున్నా కౌంటింగ్‌ సిబ్బంది కూడా ప్రశ్నించకపోవడం విశేషం. చివరకు విలేకరులు వీడియోలు తీసి స్థానికంగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన తర్వాతే సతీష్‌ను కౌంటింగ్‌ హాలులో నుంచి బయటకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement