ఏకర్‌ షీల్డ్‌తో రైతులకు ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

ఏకర్‌ షీల్డ్‌తో రైతులకు ప్రయోజనం

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

ఏకర్‌ షీల్డ్‌తో రైతులకు ప్రయోజనం

కొయ్యలగూడెం: ఏకర్‌ షీల్డ్‌ వినియోగం వలన పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. సోమవారం జరిగిన పొగాకు వేలంలో, షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ పొగాకు రైతులకు ప్రోత్సాహకంగా ఏకర్‌ షీల్డ్‌ అనే గ్రోత్‌ ప్రమోటర్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీటీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్‌ పూర్ణబిందు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏకర్‌ షీల్డ్‌ రసాయనాన్ని వాడటం వల్ల పొగాకు మొక్కలో కణాల దృఢత్వం పెరిగి, రోగ నిరోధక శక్తితో పాటు ఆకు బరువు కూడా పెరుగుతుందని తెలిపారు. తద్వారా 10 నుంచి 12 శాతం వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి జె. సురేంద్రకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొయ్యలగూడెం పొగాకు వేలం నిర్వహణాధికారి శివకుమార్‌, రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల వివేకానందతో పాటు ఉత్తర తేలికపాటి నేలల పరిధిలోని ఐదు వేలం కేంద్రాల నుంచి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement