ఎన్నికల పారితోషికం వ్యత్యాసాలపై కలెక్టర్‌కు వినతి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల పారితోషికం వ్యత్యాసాలపై కలెక్టర్‌కు వినతి

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది పారితోషికంలో జరిగిన వ్యత్యాసాలను సవరించాలని కోరుతూ ఫ్యాప్టో నాయకులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఓకు రూ.2,000, ఏపీఓకు రూ.1,600, ఇతర అధికారులకు రూ.1,350 చొప్పున చెల్లించాల్సి ఉండగా.. కొన్ని మండలాల్లో రూట్‌ ఆఫీసర్ల ద్వారా తక్కువగా చెల్లించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సుమారు 10 మండలాల్లో మాత్రమే నిబంధనల ప్రకారం చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన సిబ్బందికి మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు రావాల్సిన రూ.2,000 బదులుగా కొన్నిచోట్ల కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించారని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

వసతులపై డిమాండ్‌

ఇదేసమయంలో ఉపాధ్యాయుల నియామకాలు, వసతులపై పలు డిమాండ్లు వినిపించారు. స్టేజ్‌–1, 2 అధికారుల నియామకంలో పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్‌–2 అధికారులుగా అనుభవజ్ఞులైన సీనియర్‌ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. గత ఎన్నికల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద నాణ్యమైన భోజనం, తాగునీరు అందక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంటూ.. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కేంద్రాల వద్ద పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన మెరుగైన వసతులు కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఫ్యాప్టో నాయకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement