దీపావళి పండుగ రోజున విషాదం | - | Sakshi
Sakshi News home page

దీపావళి పండుగ రోజున విషాదం

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

● ఎదురెదురుగా బైకులు ఢీ.. వ్యక్తి మృతి

● మరొకరికి తీవ్ర గాయాలు

ద్వారకాతిరుమల: దీపావళి పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం. తాడేపల్లిగూడెంకు చెందిన పాతల అశోక్‌, అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు గొర్రెల కృష్ణప్రసాద్‌ (47)తో కలిసి ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మోటార్‌సైకిల్‌పై కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వైపునకు వెళుతున్నారు. కృష్ణప్రసాద్‌ బైక్‌ నడుపుతుండగా అశోక్‌ వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో దొరసానిపాడు గ్రామ శివారుకు చేరుకోగానే ద్వారకాతిరుమల నుంచి కామవరపుకోట వైపునకు మోటార్‌సైకిల్‌పై వెళుతున్న జువ్వా నాగేంద్ర అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి వీరి బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణప్రసాద్‌, నాగేంద్రలకు తీవ్ర గాయాలుకాగా అశోక్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కృష్ణప్రసాద్‌ అదే రోజు సాయంత్రం 4.26 గంటలకు మృతి చెందాడు. నాగేంద్ర ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎస్‌కే అమీర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement