హలో ఫ్రెండ్‌.. మనిద్దరం ఆడుకుందాం | - | Sakshi
Sakshi News home page

హలో ఫ్రెండ్‌.. మనిద్దరం ఆడుకుందాం

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

హలో ఫ్రెండ్‌.. మనిద్దరం ఆడుకుందాం

గణపవరం: ‘హలో ఫ్రెండ్‌.... మీ మమ్మీకి కూడా ఎన్నికల డ్యూటీ పడిందా.? మా మమ్మీకీ ఎన్నికల డ్యూటీ పడింది. వాళ్లు ఎన్నికల డ్యూటీ చేసుకుంటే మనిద్దరం వాళ్లని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆడుకుందాం... సరేనా?’ ఇది బుధవారం స్థానిక ఎన్నికలకు పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ కేంద్రం వద్ద ఇద్దరు చిన్నారుల ముచ్చట్లు. కొందరు మహిళా ఉద్యోగులు స్థానిక ఎన్నికల విధులకు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. కొందరు తోడుగా భర్తలో, తమ బంధువులనో తెచ్చుకున్నారు. తమకు చంటిబిడ్డలు ఉన్నందున తమకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌ఓకు విజ్ఞప్తులు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement