న్యూస్‌రీల్
నీటిని బయటకు పంపాలి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు సార్వా వరి పైరును నిండా ముంచేశాయి. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటం, ముంపు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో చేలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. దీంతో పైరు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 5 వేల ఎకరాలకు పైగా, ఏలూరు జిల్లాలో 5,380 ఎకరాల్లో వరి చేలు ముంపు బారినపడినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో సార్వా సాగు చేస్తున్నారు. జిల్లాలోని 107 గ్రామాల్లో చేలు ముంపులో ఉన్నాయి. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పైరు ఈనిక, పొట్టదశలో, నాట్లు ఆలస్యమైన మెరక ప్రాంతాల్లో పైరు పిలకలు తొడిగే దశలో ఉన్నాయి.
వేలాది ఎకరాల్లో..
తీవ్ర వాయుగుండంతో ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 3,720 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 23న 728 మి.మీ., 24న 1,794 మి.మీ., 25న 1,199 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెం మండలంలో 1,500 ఎకరాలు, అత్తిలిలో 650, తణుకులో 600, ఇరగవరంలో 375, పెనుమంట్ర మండలంలో 300 ఎకరాలు వరిచేలు మునిగినట్టు వ్యవసాయశాఖ ప్రాఽథమికంగా అంచనా వేసింది. అయితే ముంపు విస్తీర్ణం మరింత ఉంటుందని రైతు లు అంటున్నారు. శుక్ర, శనివారాల్లో ఎండ తీవ్రత పెరిగినా చేలల్లోని నీరు బయటకు వెళ్లడం లేదని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని అంటున్నారు. మరో రెండు రోజులు ఇలా ఉంటే పైరు కుళ్లిపోతుందని వాపోతున్నారు.
ఉద్యాన పంటలకు నష్టం
తాడేపల్లిగూడెం: భారీ వర్షాలతో రాష్ట్రంలో 286 గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ కె.ధనుంజయరావు అన్నారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. 12 జిల్లాల్లోని 84 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 1,392 హెక్టార్లలో తో టలు మునిగి, 4,598 మంది రైతులకు సుమారు రూ.28.09 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వరద నీ రు తగ్గుముఖం పట్టిన వెంటనే చేపట్టాల్సిన యా జమాన్య చర్యలు, జాగ్రత్తల గురించి రైతులకు ఉ ద్యాన వర్సిటీ ద్వారా అందిస్తామన్నారు. పరిశోధనా శాస్త్రవేత్తలు, ఉద్యాన శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారన్నారు.
వాయుగండం
రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు
ఉమ్మడి జిల్లాలో 10 వేల ఎకరాలకు పైగా ముంపులో..
రైతులు రక్షణ చర్యలుతీసుకోవాలంటున్న వ్యవసాయశాఖ
నీట మునిగిన చేలల్లో ముంపు నీరు బయటకు వెళ్లేలా రైతు లు చర్యలు తీసుకోవాలి. రెండు, మూడు రోజుల్లో నీరు పూ ర్తిగా బయటకు వెళితే పైరుకు పెద్దగా నష్టముండదు. పూర్తిగా నీరు బయటకు వెళ్లిన తర్వాతే పూర్తి నష్టం అంచనా వేయగలం. నీటి మునిగిన ప్రాంతాల్లో రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నీరు బయటకు వెళ్లేలా చూడాలి.
– జి.సునీత,
జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం


