దెందులూరులో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

దెందులూరులో అరాచక పాలన

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

● మారణాయుధాలతో ఆటో డ్రైవర్‌పై దాడులా?

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ ధ్వజం

ఏలూరు టౌన్‌: దెందులూరు నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందనీ.. కనీసం పార్టీ కార్యక్రమాలను సైతం చేయనీయకుండా అడ్డుపడుతూ వైఎస్సార్‌సీపీ దెందులూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, పార్టీ నేతలను నిర్భందించటం.. టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విఘాతంలా మారతాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. దెందులూరు నియోజకవర్గంలోని దోసపాడులో కిరణ్‌ అనే ఆటోడ్రైవర్‌పై టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు మారణాయుధాలతో దాడులకు తెగబడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఏలూ రు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పార్టీ సమన్వయకర్తలు అబ్బయ్యచౌదరి, కంభం విజయరాజు (చింతలపూడి), మామిళ్లపల్లి జయప్రకాష్‌ (ఏలూరు)తో కలిసి శనివారం రాత్రి ఆ యన పరామర్శించారు. కిరణ్‌ ఆరోగ్యస్థితిని అడి గి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందించా లని వైద్యులను కోరారు. అనంతరం డీఎన్నార్‌ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని దోసపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్న అబ్బయ్య చౌదరి, పార్టీ నేతలను అడ్డుకోవటం సరికాదన్నారు. కనీసం పరామర్శలకు సైతం వెళ్లకుండా దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వటమే అన్నారు. దోసపాడులోకి వెళుతున్న సమయంలో గ్రామానికి చెందిన ఆటోడ్రై వర్‌ కిరణ్‌, మరికొందరు అబ్బయ్యచౌదరి కోసం వస్తూ ఉండగా.. టీడీపీ కార్యకర్తలు వారిపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారన్నారు. టీ డీపీ ఎమ్మెల్యే దుష్ట సంప్రదాయాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందనీ, హక్కులను సైతం హరించేలా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్‌సీపీ భ యపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్‌, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, ఏలూరు పరిశీలకుడు డీవీఆర్‌కే చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌చౌదరి, జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, నాయకులు ముంగర సంజయ్‌ కుమార్‌, నెరుసు చిరంజీవి, గంటా మోహనరావు, కిలాడి దుర్గారా వు, నిట్టా నీలానవకాంతం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement