ముంపులో గుండేటి వాగు వంతెన | - | Sakshi
Sakshi News home page

ముంపులో గుండేటి వాగు వంతెన

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

ముంపులో గుండేటి వాగు వంతెన గోదావరికి వరద పోటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించాలి

కుకునూరు: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో కుకునూరు మండలంలోని కుకునూరు–దాచారం మధ్య ఉన్న గుండేటి వాగు వంతెన శనివారం నీట మునిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు చేరుకోవడంతో వంతెనపైకి వరద నీరు చేరింది. దీంతో కుకునూరు మీదుగా దాచారం, బెస్తగూడెం, వేలేరుపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం 22 అడుగులకే గుండేటి వాగు వంతెన నీట మునగడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి వరద ఉధృతి మరింత పె రిగే అవకాశం ఉందన్న సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

పోలవరం రూరల్‌: గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా పెరగడంతో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి 5,39,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. స్పిల్‌వే వద్ద 31 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. సుమారు 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు.

ఆగిరిపల్లి: మండలంలోని సగ్గూరులోని ఆమని చెరువు ఆయకట్టు రైతుల సమస్యలను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి శనివారం పరిశీలించారు. ఆమని చెరువు ఆయకట్టు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఆమని చెరువు నీటిని తమ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, తమ సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సగ్గూరుకు చెందిన రైతులు కలెక్టర్‌ను కోరారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, కృష్ణా జిల్లా ఇరిగేషన్‌ ఈఈ కె.బాబు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ పీఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌, ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఎంజే అభిషేక్‌ గౌడ ఆదేశించారు. భారీవర్షాల అనంతరం చాటపర్రు రోడ్డులోని బాలాజీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రెయిన్లలో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, రెండు రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. నగరంలో రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా, డ్రెయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ ఉన్నారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జాతీయ రహదారిపై బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు చెప్పా రు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో శనివారం ఆయ న జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement