హత్య కేసులో వీడుతున్న మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

● మృతురాలు మంగళగిరికి చెందిన కల్యాణిగా గుర్తింపు

● వివాహేతర సంబంధమే హత్యకు దారిసిందా?

● పోలీసుల అదుపులో అనుమానితుడు

ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఎ న్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో ఈనెల 18న లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతదేహానికి తల, కాళ్లు, చేతులు వేరుచేసి ఉండటంతో పోలీసులు హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతురాలి చేతిపై ఉన్న ఈక టాటూ, చెవి దుద్దులు, కాళ్ల పట్టీలు, దుస్తులు ప్రచార మాద్యమాల్లో ప్రసా రం కావడంతో మృతురాలిని ఆమె సోదరుడు నా గరాజు గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు. ఈ పరిణామాలతో మృతురాలు గుంటూరు జిల్లా మంగళగిరి హుస్సేన్‌ కట్ట ప్రాంతానికి చెందిన కర్రి దుర్గ ఆలియాస్‌ కల్యాణి (30) గుర్తించామని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం శనివారం విలేకరులకు తెలిపారు. విజయవాడ భవానీపురానికి చెందిన మటన్‌షాపు యజమాని షఫీతో కల్యాణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కల్యాణి కుమారుడు షఫీ వద్ద ఉంటున్నాడు. ఈ నెల 17న రూ.20 వేలు ఇవ్వాలని కల్యాణి ఒత్తిడి చేయడంతో ఆమెను భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి షఫీ హత్య చేశాడు. తన స్నేహితుడు గురువులుతో కలసి హత్యచేసిన అనంతరం కల్యాణ శరీర భాగాలను బ్యాగ్‌లో నింపి ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో గొల్లపూడి వద్ద పడేసినట్లు తేల్చారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం చినతాడినాడకు చెందిన కల్యాణి తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో ఆమె సోదరుడు నాగరాజుతో కలిసి కొన్నాళ్లు గన్నవరం సమీపంలో బుద్దవరం అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. మేజర్లు అయిన తర్వాత మంగళగిరి హుస్సేన్‌ కట్ట ప్రాంతంలో అద్దె భవనంలో నివసించారు. కల్యాణికి వి వాహం అయిన తర్వాత మంగళగిరిలోనే ఉంటుండగా, సోదరుడు విజయవాడలో సెటిలయ్యాడు. వివిధ కారణాలతో భర్త నుంచి విడిపోయిన కల్యాణి అక్కడే ఉంటూ వివిధ హోటళ్లలో సప్లయర్‌గా పనిచేస్తోంది. ఆమె సోదరుడి ద్వారా వివరాలు తెలుసుకున్న ఏసీపీ దుర్గారావు, సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ సత్యవతి మంగళగిరిలోని మృతురాలి ఇంటికెళ్లి ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత విలువైన సమాచారం సేకరించారు. కల్యాణికి సన్నిహితంగా ఉన్న బంగారం షాపు దామోదర్‌, కరీం హోటల్‌ గౌస్‌, ఆల్ఫా హో టల్‌ ఆదానీ ఆలీలను పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కాల్‌డేటా, చివరి ఫోన్‌ కాల్‌ ఎవరికి వెళ్లింది. ఎక్కువ సేపు ఎవరితో మాట్లాడిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ

కల్యాణి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement