రాజమహేంద్రవరం రూరల్: వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన జోన్02 ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బీసీ నాయకుల సమావేశం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి ర మేష్‌యాదవ్ తెలిపారు. శనివారం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఏర్పాట్లను వారు, ఎమ్మెల్సీ కవు రు శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ న వుడు వెంకటరమణ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ, రమేష్‌యాదవ్ మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వారికి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు పదవుల్లో, పథకాల్లో తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నవుడు వెంకటరమణ మాట్లాడుతూ బీసీ గర్జనకు బీసీ వర్గాలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రాష్ట్ర మా జీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.
కాతేరులో విస్తృత ఏర్పాట్లు


