భీమవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి రామరాజు శనివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ధర్మవరంలోని స్వగృహంలో కన్నుమూశారు. తీవ్ర విషాదంలో ఉన్న మురళీకృష్ణంరాజును మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుతోపాటు పలువురు నాయకులు మురళీకృష్ణంరాజును నేరుగా కలిసి పరామర్శించారు.


