న్యూస్‌రీల్
మేయర్ ‘వార్’
శురకవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థ ఆ దేశాల మేరకు శనివారం ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లావ్యాప్తంగా జా తీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా బెంచీలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 10,577 కేసులను రాజీయోగ్యమైనవిగా గుర్తించామన్నారు. కక్షిదారులు ప్రత్యక్షంగా గాని న్యాయవాది ద్వారా గాని సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గత జూలైలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 7,910 కేసులను పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించా రు. 99 రోజులకు రూ.64,93,560 సమకూరినట్టు ఆలయ ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 99,200 ఆదాయం లభించిందన్నారు. దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాసు, ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ పర్యవేక్షించగా ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గర్భిణులు ఆహారంపై జాగ్రత్త వహించాలని, ప్రోటీన్ ఎక్కువగా ఉండేటా చూసుకోవాలని ఐసీడీఎస్ పీడీ పి.శారద అన్నారు. గురువారం ఏలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సుంకరవారితోట అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ నెల రోజులపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆహారంలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మినరల్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఏలూరు ప్రాజెక్టు అధికారి సీడీపీఓ ఎ.పద్మావతి మాట్లాడుతూ ఆహారంలో వైవిధ్యం, అంగన్‌వాడీ కమిటీ పనులు, ఐవీఆర్‌ఎస్ కాల్స్, ఆహారంలో పోషక విలువలను వివరించారు. సూపర్ వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సగం సీట్లు కావాల్సిందేనని జనసేన.. జనసేనకు అంత సీన్ లేదంటూ టీడీపీ.. ఏలూరు నగర మేయర్‌తో సహా నాలుగు మున్సిపల్ చైర్మన్లు కావాలని జనసేన.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలిచ్చి పార్టీ అధిష్టానం సరిపెడుతుందని టీడీపీ.. ఇలా రెండు పార్టీల మధ్య కుమ్ములాటలకు స్థానిక సంస్థల ఎన్నికలు తెరలేపాయి. జనసేన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలు మొత్తం జనసేనకే ఇవ్వాలని డిమాండ్ తెరమీదకు తెచ్చిన క్రమంలో కౌంటర్‌గా టీడీపీ నేతలు ఆశావహులను ప్రమోట్ చేస్తూ హడావుడికి తెరతీయడం ఉమ్మడి పశ్చిమలో చర్చనీయాంశంగా మారింది.
మాదంటే.. మాదంటూ.. ఉమ్మడి పశ్చిమలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ముందుగానే మొదలైంది. సామాజిక, పార్టీ ఓటింగ్, పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా కచ్చితంగా 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన బలంగా డిమాండ్ చేస్తోంది. దానికనుగుణంగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న జనసేన సమావేశాల్లో ఎమ్మెల్యేలు సైతం అదే మాట చెబుతున్నారు. ఇక దీనికి సమాంతరంగా టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో మెజార్టీ స్థానాలు తెలుగుదేశానికే ఉంటాయని ఆశావహులంతా సిద్ధంగా ఉండాలని, ఎవరి ప్రచారాలను పట్టించుకోవద్దంటూ పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానంపై రెండు పార్టీల్లో బలమైన పోటీ ప్రారంభమైంది. జనసేనకు అత్యధిక బలం ఉండి, పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అసెంబ్లీ సీటు ఇచ్చామని, దానికి అనుగుణంగా అప్పట్లో నగర మేయర్ స్థానం తమకు వస్తుందని పార్టీ పెద్దలు చెప్పారని దానికనుగుణంగా ఏలూరు మేయర్ స్థానం తమకు ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏలూరు నగరపాలక సంస్థ, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం మున్సిపల్ చైర్మన్ స్థానాలు కోసం జనసేన నేతలు పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో ఆయా స్థానాల కోసం టీడీపీ నేతల నుంచి బలమైన పోటీ ప్రారంభమైంది. టీడీపీ మరో అడుగు ముందుకేసి హడావుడిగా ఆశావహులను తెరపైకి తెస్తుంది.
విద్యార్థిని లక్ష్మిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
ద్వారకాతిరుమల: ఇన్‌స్పైర్–మనక్ జాతీయస్థాయి ప్రదర్శనకు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థిని పోలుబోయిన లక్ష్మి ఎంపికై ంది. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రదర్శన, ప్రాజెక్ట్ (ఎన్‌ఎల్‌ఈపీ) పోటీల్లో ప్రతిభ చాటిన లక్ష్మి ఈ ప్రదర్శనకు అర్హత సాధించింది. 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన ఆమె ఎవరైనా దాడికి పాల్పడినప్పుడు కరెంట్ షాక్ ఇచ్చేలా పనిచేసే సేఫ్టీ లిప్‌స్టిక్ ప్రాజెక్టును రూపొందించి ఘనత సాధించింది. ఆమెను గురువారం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. వచ్చేనెల 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జాతీయస్థాయి ప్రదర్శన జరుగనుంది. పాఠశాల హెచ్‌ఎం పి.శేషుకుమార్, గైడ్ టీచర్ సీహెచ్ కాంతారావు, సైన్స్ ఉపాధ్యాయ బృందం చినవెంకన్న దేవస్థానం ఈఓ, పాఠశాల కరస్పాండెంట్ వేండ్ర త్రినాథరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈఓ ఆకాంక్షించారు. ఆల య చైర్మన్ ఎస్వీ సుధాకరరావు సైతం విద్యార్థినికి అభినందనలు తెలిపారు.
జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలోని భవానీ ముక్తేశ్వేర స్వామి వారి దత్తత ఆలయం చెన్నకేశవ స్వామివారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు తెలిపారు. ఈనెల 6న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవార్లకు చెందిన 6.5 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగారం చోరీ చేశారన్నారు. సోమవారం జిల్లా ఏసీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ గా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంతో..
చోరీకి ముందు నంబర్ ప్లేట్ లేని కారు ఆలయం చుట్టు పక్కల సంచరించగా ముగ్గురు వ్యక్తులు ఆల యంలోకి వచ్చి రెక్కీ చేసినట్లు సీసీ ఫుటేజీలలో గుర్తించామని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల కోటయ్య అలియాస్ కోటేశ్వరరావు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రా మానికి చెందిన అల్లుడు కావటంతో తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లోని ఆలయాల పూర్తి సమాచారం సేకరించి పాత నేరస్తులు నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మయ్యపల్లికి చెందిన డేరంగుల మల్లేష్, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన కారం సాంబయ్యలతో కలిసి చోరీకి పాల్పడినట్టు తెలిపారు. వీరిని కోదాడ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తు, కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఏలూరు టౌన్: ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో సైబర్ నేరగాళ్ల ప్రలోభాలతో ఆమాయక ప్రజలు మోసపోతున్నారనీ.. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై బ్యాంకు అధికారులకు వివరించారు. ముఖ్యంగా ఫిషింగ్ లింకులు, ఫేక్ కేవైసీ అప్‌డేట్స్, లోన్ యాప్స్‌లో మోసాలపై బ్యాంకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాతాదారులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. బ్యాంకు ప్రాంగణాల్లో సైబర్ నేరాల నివారణకు పోస్టర్లు, హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రదర్శించాలని సూచించారు.
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం కోసం జనసేన బలంగా ప్రయత్నిస్తోంది. ఓటింగ్ పరంగా పార్టీకి పట్టుందని, గతంలో పొత్తుల్లో దక్కిన ఏలూరును చివరి నిమిషంలో మార్చి జనసేనకు నష్టం చేకూర్చారని, అందుకే మేయర్ స్థానం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన నేతలతో సంబంధం లేకుండా ఏలూరు నగరంలో డివిజన్ల పునర్విభజన స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగింది. దీంతో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు విభజన గందరగోళంగా జరిగిందని, సర్వే నంబర్లు, చెరువుల పేరుతో డివిజన్ల హద్దులు నిర్ణయించడం సరికాదని, కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మళ్లీ వివాదం రేగింది.
సీట్లు.. సిగపట్లు
ఏలూరు మేయర్ సీటు కోసం జనసేన పట్టు
అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరం
ఉమ్మడి జిల్లాలో మూడు మున్సిపల్ చైర్మన్లు, ఒక నగర పంచాయతీ ఇవ్వాలని డిమాండ్
వార్డు కౌన్సిలర్లు, నగర కార్పొరేటర్ల సీట్లతో సరిపెడతామంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలు
ఉమ్మడి పశ్చిమలో కూటమి కుమ్ములాటలు ప్రారంభం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలతో పాటు ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్ని మున్సిపాల్టీలు పునర్విభజన, ఇతర అంశాలపై కోర్టులో కేసు ఉన్నా ఎన్నికలు జరుగుతాయని ముందస్తు హడావుడికి తెరలేచింది. దీంతో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మున్సిపాల్టీతో పాటు అత్యధిక స్థానాలు పొత్తుల్లో దక్కించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. అలాగే భీమవరం మున్సి పాల్టీలో టీడీపీ, జనసేన చైర్మన్ స్థానాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీరియస్‌గా మున్సిపల్ చైర్మన్ కోసం పట్టుపట్టకపోయినా నేతలు మాత్రం బలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు 50 వార్డులున్న భీమవరంలో 20 వార్డులు బీజేపీకి ఇవ్వాలని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ డి మాండ్ చేయడం విశేషం. తణుకులో పొత్తుల్లో జనసేనకు దక్కాల్సిన సీటును త్యాగం చేసినందుకు మున్సిపల్ చైర్మన్ జనసేనకే ఇవ్వాల్సిందేనని డిమాండ్ తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతలు మాత్రం అన్ని సీట్లు, అన్ని స్థానాలు ఇచ్చేంతా సీన్ లేదని ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి కోట్లు ఖర్చు పెట్టేవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, జనసేనకు ప్రతిచోట 15 శాతానికి మించకుండానే సీట్లు ఉంటాయని కేడర్‌కు బలంగా చెబుతున్నారు.


