ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’

వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నాటికగా చైతన్య కళాస్రవంతి ఉక్కునగరం వారి అగ్నిసాక్షి నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరి వారి జనరల్‌ బోగీలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కృష్ణా కల్చరల్‌ అసోసియేషన్‌ గుడివాడ వారి ద్వారబందాల చంద్రయ్యనాయుడు నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ రచన మాడభూషి దివాకర్‌ బాబు, ఉత్తమ దర్శకత్వం పి.బాలాజి నాయక్‌, ఉత్తమ నటుడిగా ఆర్‌వీఎల్‌ నర్సింహరావు, ఉత్తమ నటిగా అమృత వర్షిణి, ఉత్తమ ప్రతినాయకుడిగా గోపరాజు విజయ్‌, ఉత్తమ హాస్యనటుడిగా ఎస్‌.సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా అల్లు రామకృష్ణ, గంటా రామ్మోహనరావు, గంటా కళ్యాణి నాయుడు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement