ఏలూరు (టూటౌన్): కై కలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారాలపై భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల పునర్విభజన సమయంలో కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో చేరిందని, కై కలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని 22 ఏ భూ సమస్యలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎస్‌కి తెలియజేశారు.


