న్యూస్‌రీల్
పంచాయతీ నిధుల గోల్‌మాల్
పంచాయతీల్లో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. 8లో u
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
ద్వారకాతిరుమల: చిన్నవెంకన్న ఆలయంలో తవ్వేకొద్దీ నకి‘లీలలు’ బయటపడుతున్నాయి. రూ. 200 నకిలీ దర్శనం టికెట్ల విక్రయాలు దేవాలయ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. దాంతో రోజుకో ఉద్యోగి అక్రమాలు బయట పడుతున్నాయి. మొదటి నుంచి దర్శనం టికెట్ల గోల్‌మాల్‌పై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు సంచలనంగా మారాయి. ఈ నెల 15న టికెట్ కౌంటర్‌లో ఐఎస్‌జే రాజు రూ.200ల 61 నకిలీ దర్శనం టికెట్లు విక్రయించినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. దేవస్థానానికి సంబంధం లేని మరో సాఫ్ట్‌వేర్ ద్వారా తయారు చేసిన టికెట్లను పెన్‌డ్రైవ్‌లో వేసుకొచ్చి, వాటిని ప్రింట్‌లు తీసి భక్తులకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. దీనిపై ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాజు, సెక్యురిటీ గార్డు మేకా సతీష్‌పై కేసు నమోదు చేసిన ఎస్సై, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎ.వీరబాబును విచారించారు.
మరికొందరి పాత్రపై ఆరా
మరి కొందరు ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’లో మంగళవారం శ్రీవారి సొమ్ము ‘అవుట్’ సోర్సింగ్ శీర్షికన కథనం ప్రచురితమైంది. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్‌లోని పాత సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా, ఈ ఏడాది జనవరి 31న ఉదయం సుమారు 11.20 గంటల సమయంలో శేషు పెన్‌డ్రైవ్ పెట్టి నకిలీ టికెట్లు ప్రింట్ తీయడాన్ని గుర్తించారు. అధికారుల సమాచారంతో పోలీసులు శేషుని టికెట్ కౌంటర్ వద్ద మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని, పోలీస్టేషన్‌కు తరలించారు.
పెన్‌డ్రైవ్ అందించిన వ్యక్తి ఎవరు?
నిందితులు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఎవరు తయారు చేశారు.. దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి.. ఈ నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇంకెంత మంది పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 19న ఓ వ్యక్తి క్యూలైన్‌లో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి నిందితుడికి పెన్‌డ్రైవ్ అందించినట్టు గుర్తించారు. అయితే ఎవరా వ్యక్తి.. ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు తెలియరాలేదు.
ఆ డబ్బు ఎవరిది? రూ.100 టికెట్ కౌంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటలకు రూ.4,500 నగదుకు లబ్బరు చుట్టి ఓ మూలన ఉండడాన్ని ఓ ఉద్యోగి గుర్తించాడు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు ఆ నగదును స్థానిక పోలీస్టేషన్‌లో అప్పగించేందుకు వెళ్లగా, డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీ జరిపించి, అనుమానితులను గుర్తించి ఫిర్యాదు చేయాలని ఎస్సై వారికి సూచించారు. దాంతో అధికారులు వెనుదిరిగారు.
నకిలీ టికెట్ల వ్యవహారంలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదు చేశాం. మరో ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నాం. త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేస్తాం.
– టి.సుధీర్, ద్వారకాతిరుమల ఎస్సై
శ్రీవారి కొండపై బయటపడుతున్న అక్రమాలు
రూ.200 నకిలీ దర్శనం టికెట్ల కేసు దర్యాప్తు ముమ్మరం
మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు


