తిరుమల పవిత్రతను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

తిరుమల పవిత్రతను కాపాడాలి

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

బీఆర్‌ నాయుడిని టీడీడీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలి

ఏలూరులో వైఎస్సార్‌ సీపీ నేతల భారీ ధర్నా

ఏలూరు టౌన్‌: తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందనీ.. బీఆర్‌ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై టీడీపీ ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచీ భారీ ర్యాలీగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్‌ నాయుడు టీడీడీ చైర్మన్‌గా పదవి చేపట్టిన నాటినుంచీ అంతా వివాదాస్పదమేననీ... తిరుమల తిరుపతిలో అన్నీ అపచారాలే చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలతో దొరికినా యావత్‌ భక్తులు, మహిళా లోకం తప్పుబట్టినా... విపక్షాలు ఎత్తి చూపినా సీఎం చంద్రబాబు మాత్రం చెవులు గట్టిగా మూసుకుని తనకేమీ పట్టనట్లు వ్యవహరించటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్‌ నాయుడ్ని పదవినుంచి తప్పించాలని మహిళలు తిరుపతిలో ఆయన బసచేసిన హోటల్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తే తన గూండాలతో నిర్ధాక్షిణ్యంగా దాడి చేయించడం అతడి అహంకారానికి నిదర్శనమని అన్నారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కూటమి నేతల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు నిజంగా శ్రీ వేంకటేశ్వరస్వామిపై భక్తి, భయం ఉంటే తక్షణమే బీఆర్‌ నాయుడ్ని టీటీడీ చైర్మన్‌గా తొలగించి తన చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ టీడీపీ నేతలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నారనీ, కనీసం తాను తప్పు చేశాననే ఆలోచన టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయడికి లేకపోవటం ఆయన నైతికతకు నిదర్శనం అన్నారు. ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్‌బాబు, దాసరి రమేష్‌, బీవీఆర్‌ చౌదరి, వెజ్జు వెంకటేశ్వరరావు, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్‌, వడ్డీల కార్పొరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణంరాజు, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, నిడమర్రు జెడ్పీటీసీ కాశీ, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, అర్జున్‌రావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పీ.రాజేష్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సమన్వయకర్తలు కంభం విజయరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్‌, పార్టీ శ్రేణులు, ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తున్న మహిళా నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement