తాడేపల్లిగూడెం: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న 12వ అంతర్ కళాశాలల క్రీడల పోటీల్లో విద్యార్థులు తమ క్రీడా ప్రతిభతో అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పోటీలు పురుషుల విభాగంలో ఉద్యానకళాశాల వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట కళాశాల రన్నర్‌అప్ అయ్యింది. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట జట్టు ద్వితీయ జట్టుగా నిలిచింది. జావెలిన్ త్రోలో పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థి నాని శ్రీహర్ష విజేతగా నిలువగా, పులివెందుల కళాశాల విద్యార్థి ప్రశాంత్ ద్వితీయ స్థానం, వీఆర్‌గూడెం కళాశాల విద్యార్థి రాహుల్ మూడో స్థానం పొందారు. మహిళల విభాగంలో పార్వతీపురం విద్యార్థి మౌనిక , వీఆర్‌గూడెం విద్యార్థి అంబిక రెండో స్థానం, పార్వతీపురం విద్యార్థి తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెంలో అనంతరాజుపేట, వీఆర్ గూడెం విద్యార్థులు తర్వాత రెండు స్థానాల్లో నిలిచారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి క్రీడలు దోహదం చేశాయని అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతిరావు అన్నారు. క్రీడలను ఉపకులపతి ధనుంజయరావు, తదితరులు ఆసక్తిగా తిలకించారు.


