వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం కళా ప్రాంగణంలో గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాటక రంగాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని వక్తలు కోరారు. అనంతరం గుడివాడ వార్ఙి ద్వార బంధాల చంద్రయ్య నాయుడ్ఙు నాటికను ప్రదర్శించారు. స్వాతంత్య్ర పోరాటానికి పునాది వేసిన ద్వారబందాల చంద్రయ్యనాయుడు జీవిత చర్రితను కళ్లకు కట్టినట్లు చూపించిన నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. సమావేశంలో వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పోలిశెట్టి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, టీవీ సీరియల్ నటి కనకదుర్గ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకుల లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


