
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది.
అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్‌ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు.

నిండా ముంచేను

నిండా ముంచేను