
రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం విచ్చేయనున్నారు. ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం పార్టీ కేంద్ర కా ర్యాలయం విడుదల చేసింది. 13న మ ధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం వద్ద నుంచి 3.20 గంటలకు హెలీప్యాడ్‌కు వస్తారు. 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్స్ సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 4.35 గంటలకు వివాహ వేదిక వీఎస్‌ఎస్ గార్డెన్‌కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 5.10 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు.
నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న బాధ్యతల స్వీకరణ
నూజివీడు: నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి బొల్లిపల్లి వినూత్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2022–23 బ్యాచ్‌కు చెందిన ఆమె ఇప్పటివరకు అనంతపురం ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వినూత్న సివిల్స్ రాసి ఏఐఎస్‌గా ఎంపికయ్యారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ కావడం గమనార్హం. వినూత్న తండ్రి పశుసంవర్ధకశాఖలో జిల్లా అధికారి కాగా, తల్లి వ్యవసాయశాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తానన్నారు. ఇప్పటివరకు ఇక్కడ సబ్ కలెక్టర్‌గా వి ధులు నిర్వహించిన బచ్చు స్మరణ్‌రాజ్‌కు ప్రభుత్వం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
విద్యార్థి సంఘాల నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్య కమిటీలు తప్ప బయట వ్యక్తులు, సంస్థలు ప్రవేశించరాదంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన తెలిపి ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఈ సందర్భంగా కాకి నాని మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామన్న మంత్రి లోకేష్, ఈ మాటలను పూర్తిగా విస్మరించారన్నారు. పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు ఎం.యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఇస్తున్న ఉపన్యాసాలు వట్టి మాటలేనా అని ప్రశ్నించారు. ఈ జీఓను రద్దు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఉపాధి హామీ కూలీలపై వివక్ష
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీలపై వివక్ష చూపుతున్న ప్రభుత్వాలు వేతన బకాయిలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. ఏలూరు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. మూడు, నాలుగు నెలల నుంచి వేతనాల ఇవ్వకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. నిధుల కోత వలన కనీసం 30 రోజులకు కూడా పనులు దక్కడం లేదని ఆరోపించారు. పనిచేసిన రెండు వారాల్లోపు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం కమిటీ సభ్యులు తామా ముత్యాలమ్మ, ఎస్.మహంకాళిరావు, యు.వెంకటేష్, సత్యనారాయణ, కె.దుర్గ, చలపతి, ఎ.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..