
31 వరకు ‘ఆపరేషన్ ట్రేస్’
ఏలూరు టౌన్: జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ట్రేస్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాల మేరకు తప్పిపోయిన బాలలను గుర్తించి, వా రి తల్లిదండ్రుల చెంతకు చేర్చే కార్యక్రమాన్ని ఈనెలాఖరు వరకు చేపడతున్నామన్నారు. ప్రభుత్వ హోమ్స్, ఎన్‌జీఓ హోమ్స్‌లో ఉంటున్న పిల్లల తల్లి దండ్రిని ట్రేస్ చేసి వారి అప్పగించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఏలూరు శక్తి టీమ్ శనివారపుపేటలోని ప్రభుత్వ వసతి గృహంలోని పిల్లలతో మమేకమయ్యారు. చైన్నె సీడబ్ల్యూసీ నుంచి ఏలూరు సీడబ్ల్యూసీకి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను పంపించారనీ, వారంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల వారిగా చెప్పారనీ, అయితే పూర్తి చిరునామా చెప్పలేకపోయారన్నా రు. అనంతరం ఏలూరు మహిళా స్టేషన్, శక్తిటీం, భీమవరం చైల్డ్‌లైన్ సిబ్బంది సమన్వయంతో బా లల తల్లితండ్రిని గుర్తించి, వారికి అప్పగించారని తెలిపారు. సోమవారం ఏలూరు సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించారు. భీమవరం వన్‌స్టాప్ సెంటర్‌లో ఉన్న ఇ ద్దరు బాలికలను తల్లితండ్రి తీసుకువెళ్లవచ్చన్నారు.