
నేడు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ సమావేశం
దెందులూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం ఏలూరు సుఖీభవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. దెందులూరులోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కా ర్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విచ్చేస్తారన్నారు. అతిథులుగా ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు హాజరవుతారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, సర్పంచులు బోదుల స్వరూప్, ప్రభుదేవా, ఎంపీటీసీ పులవర్తి దేవానంద్, పార్టీ నాయకులు గారపాటి నాగేశ్వరరావు, కమ్ముల మోహన్, మురళి ఉన్నారు.