
హుండీ దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్
నిడమర్రు: గత నెల 26న పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో దేవాలయాల్లో హుండీలు బద్దలుగొట్టి నగదు దోచుకున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు నిడమర్రు సీఐ ఎన్.రజనీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉండి మండలం అరేడు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి మహిమ కుమార్, గణపవరానికి చెందిన యంబల జోషి, పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన మరొకరిని హుండీ దొంగతనం కేసులో నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేసామన్నారు. వీరు గతంలో ద్వారకా తిరుమల్లో షాపు దొంగతనంలో, దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హుండీ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. వీరిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి బైక్, రూ.5,721 నగదు, రెండు రాడ్లు స్వాదీనం చేసుకున్నామని, సోమవారం తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.