
పాత తెరలు చిరిగిపోయాయి
గత రెండు సంవత్సరాల నుంచి మాకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయాలి.
నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గతేడాది పంపిణీ చేయలేదు. ఈ ఏడాది పంపిణీ చేస్తారో లేదో అనే అనుమానం వస్తుంది. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి.
కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం
ప్రత్యేక దృష్టి పెట్టాం
జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని కోసం సుమారు 2 లక్షల 50 వేలు దోమ తెరలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. అవి వచ్చిన వెంటనే మలేరియా సమస్యత్మక గ్రామాల్లో పంపిణీ చేస్తాం.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియాధికారి, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం

పాత తెరలు చిరిగిపోయాయి

పాత తెరలు చిరిగిపోయాయి