
13న మాజీ సీఎం జగన్ రాక
భీమవరం : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఈనెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం రానున్నారు. ఆదివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పరిశీలించారు. భీమవరం శివారు వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో వివాహ వేడుక జరుగనున్నందున సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఆయన వెంట వాసుబాబు, వైఎస్సార్‌సీపీ భీమవరం ని యోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం పట్టణ అధ్యక్షుడు గా దిరాజు రామరాజు తదితరులు ఉన్నారు.
టోల్‌గేట్ క్రాంటాక్టర్‌కు నోటీసులు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన టోల్‌గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కు దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి ఆదివారం నోటీసు జారీ చేశారు. బైక్‌లు, మోపెడ్‌లకు రూ.10ల రుసుం వసూలు చేయాల్సి ఉండగా రూ.20లు వ సూలు చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘శ్రీవారి కొండపై టోల్ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురించగా ఈఓ స్పందించారు. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చారు.
పవిత్రోత్సవం.. పరిపూర్ణం
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో నా లుగు రోజులపాటు జరిగిన శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూ ర్ణాహుతి హోమం అనంతరం మహదాశీర్వచనాన్ని అర్చకులు, పండితులు వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ములవిరాట్, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వి విధ దినుసులతో మహాపూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నాలుగు రోజులుగా ఆలయంలో నిలిపివేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు.
సాయం చేసేలా.. సేవాభావం పెంచేలా..
ఏలూరులో కైండ్‌నెస్ వాల్ అల్మారా ఏర్పాటు
ఏలూరు టౌన్ : సమాజంలో ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తిపై బాధ్యత, అభిమానం చాటాలే వ్యవహరించాలనే లక్ష్యంతో... తోటి వారికి సహాయం చేయాలనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వినూత్న విధానానికి శ్రీకా రం చుట్టారు. ఏలూరు అమీనాపేట పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా కై ండ్ నెస్ వాల్ పేరుతో ప్రత్యేక అల్మారా ఏర్పాటుచేశారు. ఇంట్లో ఉపయోగం లేని, వినియోగించని వస్తువులు, బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఏమైనా ఈ అల్మారాలో పెట్టవచ్చు. వీటిలో ఏదైనా ఉపయోగపడుతుందని భావిస్తే అవసరమైన వారు ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. జిల్లా ఎస్పీ శివకిషోర్, జా యింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సంయుక్తంగా ఇప్పటికే టేక్ ఏ బుక్.. గివ్ ఏ బుక్ అనే పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి నాంది పలికా రు. తాజాగా కై ండ్‌నెస్ వాల్ అల్మారాను ఏ ర్పాటుచేసి సేవా దృక్పథాన్ని చాటారు. పోలీస్ పెట్రోల్ బంక్‌లోని కై ండ్‌నెస్ వాల్ అల్మారాలో నుంచి కొందరు బాలలు తమకు నచ్చిన బట్ట లు, బొమ్మలు తీసుకువెళుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

13న మాజీ సీఎం జగన్ రాక

13న మాజీ సీఎం జగన్ రాక