
గిరిజనుల అభివృద్ధికి జగన్ కృషి
బుట్టాయగూడెం: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెం శివారు డిగ్రీ కళాశాల నిర్మాణ భవనం వద్ద జాతీయ ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్ర పంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ము ఖ్య అతిథిగా బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా గిరిజనుల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారన్నారు. నాడు– నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలు మార్చడంతో విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. సాలూరులో యూని వర్సిటీని, కురుపాంలో ఆదివాసీ గిరిజనుల కోసం ఇంజనీరింగ్ కాలేజీని, పాడేరులో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. జాతీయ ఆదివాసీ ఐక్య వేదిక ప్రతినిధులు మడివి రాజులు, మడివి వెంకటేశ్వర్లు గుండి బుచ్చిరాజు, కుర్సం నిరీక్షణరావు, కోర్సా చిన్నరాజులు, తెల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు