
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తుండగా కై కలూరు రూరల్ పోలీసులు పట్టుకుని 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8లో u
గిరిజన చట్టాల పరిరక్షణకు కృషి చేయాలి
బుట్టాయగూడెం: గిరిజన చట్టాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని తూర్పు పాలకుంట వద్ద సర్పంచ్ బన్నె బుచ్చిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, భాష, యాస కట్టుబాట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే గిరిజనులు మాత్రం వెనకకు నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు గిరిజనాభివృద్ధికి పెద్ద పీట వేసారన్నారు. ఆదివాసీ దినోత్సవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పారు. పోడు చేసుకుంటున్న సుమారు 2 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం కూడా అందించారని అన్నారు. గ్రామస్థులతో పాటు బాలరాజు గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేశారు. సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, సర్పంచ్‌లు తెల్లం వెంకాయమ్మ, మాల్చి వెంకన్నబాబు, పొడియం లక్ష్మి, నాయకులు బన్నే చంద్రకళ, తెల్లం దేవరాజు తదితరులు పాల్గొన్నారు.