ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఒక భక్తుడు శనివారం సుమారు రూ.7 లక్షలు విలువ చేసే 65 గ్రాముల బంగారు లక్ష్మీదేవి కాసుల హారాన్ని బహుకరించారు. విజయవాడకు చెందిన దాసరి రాధాకృష్ణ ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఈ హారాన్ని ఆలయ కార్యాలయంలో ఏఈఓ పి.నటరాజారావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు ఆయన సంబంధిత రసీదును అందజేశారు.
శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్త జనసంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైనరోజు, రాఖీ పండుగ కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని వేదికపై ఎన్‌టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన శ్రీ రామాంజనేయ భజన సమాజం సభ్యులు నిర్వహించిన భజనలు భక్తులను అలరించాయి.

శ్రీవారికి హారం సమర్పణ

శ్రీవారికి హారం సమర్పణ