
సంస్కృతికి వేదాలు మూలం
గణపవరం: వేదాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలమని, వేదాల పరిరక్షణకు వేద విద్యార్థులు కృషి చేయాలని పండితులు, ఘనాపాఠీలు సూచించారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 105వ వేద శాస్త్ర పరిషత్ కార్యక్రమం శనివారం ముగిసింది. దేశం నలుమూలల నుంచి 138 మంది వేద విద్యార్థులు హాజరుకాగా వీరికి 14 మంది వేదపండితులు, ఘనాపాఠీలు పరీక్షలు నిర్వహించారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో అభ్యర్థులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శనివారం నిర్వహించిన వేదపరిషత్ సభలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సాగిరాజు సుబ్బరాజు కుటుంబ సభ్యులు దెందుకూరి ప్రసాదరాజు , దెందుకూరి వర్మ దంపతులు ఈకార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, ఘనాపాఠీలకు పండిత సత్కారం నిర్వహించారు. గాయత్రిబ్రాహ్మణ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.