
ఇంటింటా శ్రావణ శోభ
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పూజ అనంతరం మహిళలు చేతికి తోరణాలు కట్టుకుని ముత్తైదువులకు తోరణాలు కట్టి వాయినాలు, తాంబూళాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరంలో మావుళ్లమ్మ వారికి 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. మావుళ్లమ్మకు అజ్ఞాత భక్తులు సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను సమర్పించారు.
– సాక్షి నెట్‌వర్క్

ఇంటింటా శ్రావణ శోభ

ఇంటింటా శ్రావణ శోభ

ఇంటింటా శ్రావణ శోభ

ఇంటింటా శ్రావణ శోభ