
సాక్షి కథనాలకు స్పందన
తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో పారిశుద్ధ్య లోపం, రహదారుల మరమ్మతులపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 8లో u
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రమాదకరం
ఏలూరు (టూటౌన్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ఓటర్ల హక్కును హరించే ఎస్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారడం తగదని, ఓటర్ల నమోదుకు పౌరుసత్వంతో ముడి పెట్టరాదని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో భాగంగా శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తొలగించేలా ఎస్‌ఐఆర్‌ను చేపట్టడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం ఎస్‌ఐఆర్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. బిహార్‌లో దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. కర్ణాటకలో ఉన్న మహాదేవపూర్ అనే పార్లమెంటు స్థానంలో 1,10,000 దొంగ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని, దొంగ ఓటర్లను వెంటనే తొలగించాలని, అర్హులైన వారందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.