
పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఇద్దరు కీలక నేతలకు చోటు దక్కింది. పీఏసీ పూర్తిస్థాయిలో పునః వ్యవస్థీకరించి నూతన నియామకాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నూతన సభ్యులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పశ్చిమగోదా వరి జిల్లా నుంచి మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏలూ రు జిల్లా నుంచి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్‌ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ముఖ్య నేతలతో కమిటీని ప్రకటించారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు రాష్ట్ర పదవులు
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులకు రాష్ట్ర పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం నియోజకవర్గానికి చెందిన బూరుగు ఫెడ్రిక్ ప్రేమ్‌కుమార్, కై కలూరు నియోజకవర్గానికి చెందిన.జాన్ విక్టర్‌ను వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సెక్రటరీలుగా నియమించారు. పోలవరం నియోజకవర్గానికి చెందిన తూమురి శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆక్వా ఫీడ్ ధరలు మరింత తగ్గించాలి
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు వదిలిన క్రాప్ హాలిడే బాణానికి ఫీడ్ కంపెనీలు దిగి వస్తున్నాయని, అయినా వారు ఇచ్చిన ఆఫర్ ఆమోదయోగ్యంగా లేదని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం స్థానిక ఆక్వా రైతు సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ తయారీ ముడి సరుకుల ధరలు వందల్లో తగ్గితే ఫీడ్ ధరలను కంపెనీలు పైసల్లో తగ్గిస్తామంటూ సంకేతాలు పంపిస్తున్నాయని అన్నా రు. ఫీడ్ ధరలు రూ.4 తగ్గిస్తామని అంటున్నారని, అయితే కిలోకు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేశారు. కనీసం రూ.20 ధర తగ్గితేనే రైతులకు ఊరటగా ఉంటుందని, లేకుంటే ఊరుకోబోమన్నారు. అమెరికా సుంకాల పేరుతో 100 కౌంట్ రొయ్యల ధరలను ప్రాసెసింగ్ యూనిట్లు తగ్గించాయని, అయితే అగ్రరాజ్యం సుంకాల విధింపున కు 90 రోజులు గడువు ఇచ్చినా ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలను పెంచడం లేదన్నారు. ఆక్వా రైతుల కష్టాలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకి వినతిపత్రం ఇచ్చామని, తాము ముందుగా రైతులమని ఆ తర్వాతే రాజకీయాలను అన్నారు. ఆదివారం భీమవరంలో జిల్లా ఆక్వా రైతు సమావేశం ఏర్పాటుచేస్తున్నామని, ఆక్వా రైతులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రాసెసింగ్ యూనిట్‌లు, రొయ్య కౌంట్ ధరలు పెంచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘ సెక్రటరీ బోణం చినబాబు, మేడిది జాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏరులై పారుతున్న మద్యం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లకు లాభాల కోసం ఊరూవాడా బెల్టుషాపులు పెట్టుకోమని కూటమి ప్రభుత్వం అను మతి ఇచ్చినట్టుందని, దీంతో ఎకై ్సజ్ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదని కల్లు గీత కార్మి కుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం స్థానిక ఎకై ్స జ్ కార్యాలయం వద్ద కల్లు గీత కార్మిక సంఘం నాయకులు మోకులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నర్సింహమూర్తి మాట్లాడుతూ బెల్టు షాపులతో కల్లు గీత కార్మికులు వ్యాపారాలు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. బెల్టు షాపులను అరికట్టాలని, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 5 వేలు, రాష్ట్రంలో 70 వేల వరకు బెల్టుషాపులు ఉన్నాయన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెర వేర్చాలన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బొక్కా చంటి, బొంతు శ్రీను, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు