
ఏలూరు: వాహనంపై వెళుతూ అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిన వలంటీర్ రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పంగిడిగూడెం గ్రామ వలంటీర్ కుక్కల రామాంజనేయులు (29) ఈనెల 14న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి పంగిడిగూడెకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
పంగిడిగూడెం హైస్కూల్ వద్దకు వచ్చే సరికి వాహనం నుంచి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతనిని జంగారెడ్డిగూడెం తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బీపీ ఎక్కువైందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు వీఆర్‌వో తెలిపారు.