సాక్షి ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ‘ఎంసెట్‌’ మాక్‌ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

AP EAPCET 2021 Online Mock Tests - Sakshi

మూడు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు

మార్కులతో పాటు ర్యాంక్‌ కార్డ్‌ కూడా విడుదల

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ ఆగస్టు 9

సాక్షి, ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్‌’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్‌’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్‌లైన్‌ మాక్‌ ఎంసెట్‌ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం.

ఈ మాక్‌ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత...లాగిన్‌ ID,  Password ను ఫోన్‌ నెంబర్, మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్‌లైన్‌ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు.  అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్‌ కార్డ్‌ను పొందవచ్చు.
 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top