దారి చూపు స్వామీ | - | Sakshi
Sakshi News home page

దారి చూపు స్వామీ

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

తాత్కాలిక రైల్వే కౌంటర్‌ అవసరం

రైలు ప్రయాణం ద్వారా చాలా మంది భక్తులు ఆలయానికి వస్తారు. స్వామివారి దర్శనం అనంతరం వారు తిరిగి అన్నవరం రైల్వే స్టేషన్‌కు వెళ్తుంటారు. రైల్వే స్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ మొదటి ప్లాట్‌ఫామ్‌పై మాత్రమే ఉంది. ఈ కార్తికమాసంలో చాలా మంది భక్తులు వస్తారు. అందువల్ల టిక్కెట్‌ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. రైల్వే అధికారులతో మాట్లాడి దేవస్థానంలో రైల్వే జనరల్‌ టిక్కెట్లు విక్రయించేందుకు తాత్కాలికంగా కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. అదే విధంగా అన్నవరం రైల్వే స్టేషన్‌లో ఆగే వివిధ రైళ్ల సమాచారం తెలిపే బోర్డులు పెట్టాలి. అన్నవరం మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఆక్రమణలు తొలగించాలి.

ఫ రత్నగిరిపై సమస్యల మోత

ఫ ‘ఆన్‌లైన్‌’ పేమెంట్లతో ఇబ్బందులు

ఫ సైన్‌బోర్డులు, విద్యుత్‌ దీపాలు లేక అవస్థలు

ఫ నేడు దేవదాయ శాఖ కమిషనర్‌ పర్యటన

ఫ సమస్యలను పరిష్కరించాలని భక్తుల వినతి

అన్నవరం: రాష్ట్రంలోనే అన్నవరం దేవస్థానానికి ప్రాధాన్యం ఉంది. ఎందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల కంటే కార్తిక మాసంలో మరింత రద్దీ ఉంటోంది. అయితే రత్నగిరిపై భక్తులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. కార్తిక మాస ఏర్పాట్లపై చర్చించేందుకు దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ శుక్రవారం వస్తున్న నేపథ్యంలో సమస్యలపై దృష్టించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నెట్‌‘వర్క్‌’ లేక..

దేవస్థానంలో వ్రతాలు, దర్శనం, కల్యాణం తదితర సేవల టిక్కెట్లు, ప్రసాదం కొనుగోలు అంతా నగదుతో కాకుండా డిజిటల్‌, యూపీఐ పేమెంట్లు, డెబిట్‌, క్రిడెట్‌ కార్డుల ద్వారానే గత ఏడాదిగా జరుగుతోంది. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానంలో ఎయిర్‌టెల్‌ సెల్‌ టవర్‌ తప్ప, మిగిలిన నెట్‌వర్క్‌ టవర్లు లేవు. దీంతో సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని పరిష్కరించాల్సి ఉంది.

సమాచారం.. అగమ్యగోచరం

ఆలయం వద్ద ఏ విభాగం ఎక్కడ ఉందో తెలిపే సైన్‌ బోర్డులు ఎక్కడా లేవు. పశ్చిమ రాజగోపురానికి కూతవేటు దూరంలోనే అన్నదానం భవనం ఉన్నా, దీనికి సంబంధించిన సైన్‌ బోర్డు అక్కడ కనిపించదు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు అన్నదాన భవనంపై కూడా సమాచారం తెలిపే బోర్డు లేదు.

ఫ రత్నగిరి, సత్యగిరి జంక్షన్‌లో కాని, ప్రకాష్‌సదన్‌ వెనుక గల మొదటి వై.జంక్షన్‌, పశ్చిమ రాజగోపురం వద్దకు దారి తీసే రెండో వై.జంక్షన్‌, తూర్పు రాజగోపురం వద్దకు దారి తీసే మూడో వై.జంక్షన్‌ వద్ద కాని సరైన సమాచారం తెలిపే బోర్డులు లేవు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా సరైన సమాచారం తెలపడం లేదనే విమర్శ ఉంది.

వెళ్లే దారి చూపాలి

ఈ నెల 24న జరిగే సత్యదేవుని గిరిప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు రానున్నారు. అయితే పోలవరం కాలువ పనుల కారణంగా జాతీయ రహదారిపై రెండు వైపులా రెండు ఫైఓవర్లు నిర్మించి ట్రాఫిక్‌ వాటి మీద నుంచి మళ్లించారు. ఆ ఫైఓవర్‌ పక్క నుంచి లేదా దిగువ నుంచి ఈ గిరిప్రదక్షిణ పుష్కర కాలువ రోడ్డులోకి వెళ్లాలి. అయితే ఆ రోడ్డు ఇంకా పూర్తి కాక గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దీనిపై కూడా దృష్టి పెట్టాలి. దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న పద్మావతి కాంట్రాక్ట్‌ సంస్థ పని తీరుపై అనేక విమర్శలున్నాయి. ఈ సమస్యలపై దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ శుక్రవారం నిర్వహించే సమీక్షలో చర్చించాలని అంతా కోరుతున్నారు.

చీకటి.. ఆ మాటేమిటి!

కార్తిక మాసంలో దేవస్థానానికి భక్తులు ముందురోజు రాత్రి నుంచే వస్తారు. అయితే అటు అన్నవరం మెయిన్‌ రోడ్డులో మండపం వైపు ఉన్న ఆర్చి నుంచి బెండపూడి వైపు వెళ్లే ఆర్చి వరకు, స్టేషన్‌ రోడ్డులో పూర్తి స్థాయిలో విద్యుత్‌ దీపాలు తెల్లవార్లూ వెలిగేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే చీకటిలో ఇబ్బంది ఎదురవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement