ఊరే.. ఏరై | - | Sakshi
Sakshi News home page

ఊరే.. ఏరై

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

ఊరే ఏరైంది.. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది.. ఇళ్లను, పొలాలను నిండా ముంచేసింది.. జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. జనానికి నరకం కనిపిస్తోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉన్న సమస్యలు ఇలా..

ఫ కొవ్వాడ కాలువ ఉగ్రరూపం

ఫ అన్నదేవరపేటలో వరద నీట ఇళ్లు, పొలాలు

తాళ్లపూడి: ఎగువ ప్రాంతాల్లోంచి వరద నీరు వచ్చి చేరడంతో కొవ్వాడ కాలువ ఉగ్రరూపం దాల్చింది. దీంతో తాళ్లపూడి మండలంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పటికే తుపాన్ల ప్రభావంతో భారీ వర్షాలకు, కొవ్వాడ వరద ధాటికి మండలంలో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అన్నదేవరపేట గ్రామంలోని జాన్‌పేట, అరుంధతీ పేటల్లో, రాగోలపల్లిలో ఇళ్ల వద్దకు వరద నీరు చేరింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొవ్వాడ కాలువ వరద ముంపు ధాటికి వందలాది ఎకరాలు ఇంకా ముంపు బారిన పడ్డాయి. అన్నదేవరపేట, రాగోలపల్లి, తాడి పూడి, బయ్యరం, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం తదితర గ్రామాల్లో 2 వేల ఎకరాల్లో వరి, కూరగాయ లు, మినుము, పొగాకు తదితర పంటలు నీట మునిగాయి. అన్నదేవరపేట నుంచి వెంకటాయపాలెం వెళ్లే కల్వర్టు, వేగేశ్వరపురం వైపునకు వెళ్లే కల్వర్టు, రాగోలపల్లి తాడిపూడి వైపుకు వెళ్లే కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో తిరుగుడుమెట్టకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. అన్నదేవరపేట గ్రామంలోని జాన్‌పేటలో రెండు వీధులు పూర్తిగా నీట మునిగాయి. మూడు అడుగుల మేర నీరు చేరింది. అరుంధతీపేట వద్ద కూడా వరద నీరు చేరింది. వరద నీటిలో విష సర్పాలు వస్తున్నాయని జనం ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంతాలను తహసీల్దార్‌ లక్ష్మీలావణ్య, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామరు.

దేవరపల్లి: గోపాలపురం మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహణకు వచ్చిన సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. మార్కెట్‌ యార్డులో దాదాపు 10 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించింది. సుమారు 3 గంటలు ఎన్నికల సిబ్బంది, పాత్రికేయులు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో చిక్కుకున్న వృద్ధురాలిని మంచంపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గ్రామస్తులు బయటకు తీసుకు వచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement