నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): హాకీ ఇండియా సహకారంతో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న అస్మిత సౌత్ జోన్ హాకీ పోటీలు బుధవారం ముగిశాయి. ఫైనల్స్లో జూనియర్స్ విభాగంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ విజయం సాధించింది. సబ్ జూనియర్స్ విభాగంలో అర్జీటీ అనంతపురం జట్టు కప్ అందుకుంది. కోకనాడ జట్టు కెప్టెన్ అంకితకు టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్ అవార్డు లభించింది. జూనియర్స్ విభాగంలో కేరళ ద్వితీయ, నైట్ రైడర్స్ తృతీయ స్థానాలను సాధించాయి. సబ్ జూనియర్స్ విభాగంలో కేరళ రెండు, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ మూడో స్థానంలో నిలిచాయి. టోర్నమెంట్ చీఫ్ ప్యాట్రన్ కర్రి పద్మశ్రీ, గిరిజన క్రీడాభివృద్ధి అఽధికారి ఎస్వీ రమణ, లయన్స్ జిల్లా గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ తదితరులు విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు కె.రవిచంద్ర, టోర్నమెంట్ కమిటీ ప్రతినిధులు సుధారాణి, రజిని, దీప్తి ఎస్తేర్, బాబ్జీ, సూరిబాబు, సురేష్రాజు, హరిబాబు పాల్గొన్నారు.


