రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల బృందం పర్యటన

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర సమీక్ష మిషన్‌ పర్యటనలో రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఈ బృందంలో ఎన్‌టీఈపీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేష్‌, ఆర్‌కేఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వీవీ సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్‌ క్యూఏ ఎస్‌.వినోద్‌ కుమార్‌, కన్సల్టెంట్‌ ఎన్‌ఎల్‌ఈపీ కుంచ సత్యవతి ఉన్నారు. వీరందరూ జిల్లాలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా కడియం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, అనపర్తి ఏరియా ఆసుపత్రితో పాటు ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భూపాలపట్నం హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, కంబాలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డైస్‌ సెంటర్‌, రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌)లను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.కోమల, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మావతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టీవీ.చలపతిరావు, ఏ సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరిచంద్ర ప్రసాద్‌, డీపీఎంఓ డాక్టర్‌ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement