కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కారు దగ్ధం

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

సామర్లకోట: స్థానిక ఉండూరు రోడ్డులో ఆదివారం ఓ కారు దగ్ధమైంది. ఆ కారు కాకినాడ నుంచి సామర్లకోట వైపు వస్తుండగా ఉండూరు గ్రామం దాటిన తర్వాత రైల్వే గేటు సమీపంలో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవరు కారును నిలిపి వేశాడు. సమీపంలో పంట కాలువలో ఉన్న నీటితో మంటలను అదుపు చేశాడు. అప్పటికే కారు కాలిపోయింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా కారు ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.

బ్రాడ్‌బ్యాండ్‌ ఆఫర్‌ పేరుతో రూ.లక్షకు టోకరా

అనపర్తి: కేబుల్‌ టెక్నీషియన్‌ అని చెప్పిన ఓ సైబర్‌ నేరగాడు వినియోగదారుడి ఖాతాలో రూ.లక్షను కాజేశాడు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బలభద్రపురంలోని ఒక కేబుల్‌ వినియోగదారునికి ఇంటికి వెళ్లిన సైబర్‌ నేరగాడు బ్రాడ్‌ బ్యాండ్‌లో ఆఫర్లు ఉన్నాయని, అవి తెలుసుకోవాలంటే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో తనతో ఫోన్‌లో మాట్లాడినట్టు నటించి, అతడిని నమ్మించాడు. అనంతరం వినియోగదారుని ఫోన్‌లో యాప్‌ వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పది నిమిషాలలో దఫదఫాలుగా రూ.లక్ష వరకు వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతా నుంచి కట్‌ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వినియోగదారుడు వెంటనే శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చి విషయం చెప్పాడు.దీనిపై పొలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement