ఇబ్బంది పడి‘నారు’ | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పడి‘నారు’

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 2026–27 పంట కాలానికి వర్జీనియా పొగాకు నాట్లు ప్రారంభం కావడంతో నారుకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో నాటడానికి అవసరమైన 6 వేల మొక్కలు రూ.4 వేల నుంచి రూ.4,500 పలుకుతుంది. ఎల్‌వీ–7, 1353 వండగాల నారుకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. రీజియన్‌ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో ముందస్తుగా రైతులు పొగాకు నాట్లు ప్రారంభించారు. మెరక ప్రాంతంలో నాట్లు వేస్తున్నారు. అప్పర్‌ ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతమైన జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలో నాట్లు వేగంగా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివర్లో కురిసిన భారీ వర్షాలకు నారుమడులు దెబ్బతినడంతో నారుకు కొరత ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు. చాల గ్రామాల్లో లేతగా నారుమడులు కడుతున్నారు. రైతుల వద్ద ట్రే నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో సుమారు 30 వేల ఎకరాల్లో పొగాకు సాగుకు బోర్డు అనుమతిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement