వదంతులు నమ్మొద్దని డీఆర్వో సూచన | - | Sakshi
Sakshi News home page

వదంతులు నమ్మొద్దని డీఆర్వో సూచన

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

పులి కాదు..

కుక్క పాదముద్రలు

దేవరపల్లి: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామ పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు వస్తున్న వదంతులు నమ్మవద్దని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎ.సూరిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ పెద్ద పులి వచ్చిందని ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. పొలాల్లోని పాదముద్రలను పరిశీలించి.. పులి కాదని అవి కుక్క పాదముద్రలని స్పష్టం చేశారు. పెద్ద పులి ప్రస్తుతం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోడ్రుకోట అటవీ ప్రాంతంలో ఉందని అన్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక నిపుణులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. నల్లజర్ల ప్రాంతంలో పెద్దపులి లేదని వివరించారు. తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో సంచరిస్తున్నది ఒకే పులి అని, రెండు పులులు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement