రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్సై దుర్మరణం పాలయ్యాడు. ఆ వివరాల ప్రకారం.. రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఏపీఎస్పీ రిజర్వు ఎస్సైగా బెజ్జి మన్మథరావు (52) విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం పలమేట్ట. కాగా శుక్రవారం ఉదయం మండలంలోని చెరకుంపాలెం వెళ్లి తన మోటారు సైకిల్పై పోలీస్ స్టేషన్కు తిరిగి వస్తుండగా, ఎదురుగా కారు వచ్చి ఢీకొంది. వెంటనే అతన్ని జడ్డంగి పీహెచ్సీకి తరలించగా ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడకు 108 అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చినబాబు తెలిపారు.


