సఖినేటిపల్లి: అంబులెన్స్ సిబ్బందిపై గురువారం సఖినేటిపల్లి రేవు వద్ద నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించినట్టు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేసింది. ఆ ప్రకారం.. చించినాడ బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో అంబులెన్స్ ఆ రేవు వద్ద ప్రయాణికుల వాహనాల మధ్యలో చిక్కుకుంది. అయితే అంబులెన్స్కు పంటిపైకి వెళ్లడానికి కచ్చితంగా టికెట్ తీసుకోవాలని రేవు సిబ్బంది దురుసుగా చెప్పారు. టిక్కెట్ కచ్చితంగా తీసుకుంటాం, మా అంబులెన్స్ను వెళ్లనివ్వండి అని ప్రాధేయపడినా కనికరం చూపలేదని సిబ్బంది వాపోయారు. ఎట్టకేలకు అంబులెన్స్ పంటిపైకి వెళ్లి నర్సాపురం వెళ్లినట్టు సమాచారం.


