రాజమహేంద్రవరం సిటీ: ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఔట్లెట్‌గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముకుంద జ్యువెలరీ 13వ షోరూం శనివారం స్థానిక తిలక్‌రోడ్‌లో ప్రారంభమెంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దీనిని ప్రారంభించారు. సంస్థ చైర్మన్ బత్తి నరసింహారెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ నికితరెడ్డి, దాచేపల్లి కృష్ణ మాట్లాడుతూ బంగారు ఆభరణాలపై ఉన్న తరుగు కేవలం 6.99 శాతం మాత్రమే కస్టమర్ల కి అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్ ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. కూకట్‌పల్లి, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర, చందనగర్, జూబ్లీహిల్స్, విశాఖపట్నం, బెంగళూరు (జయనగర్) , రాజమహేంద్రవరం షోరూమ్‌లలో నాణ్యమైన బంగారు, వజ్రాల వసు్‌ుత్వలు అందజేస్తున్నామన్నారు


