నా కూతురే నా సంపద
నా ఏకై క కుమార్తె రామ హంసిక. పిఠాపురం, మండపేట, యానాంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించడం తమకు గర్వకారణం. ఇంట్లో వారు నవ్వులు చిందిస్తు తిరుగుతుంటే కొన్ని కోట్ల ఆస్తులతో సమానం.
– పసుపులేటి సురేష్‌కుమార్
కూచిపూడిలో కీర్తి కిరీటం
తమ కుమార్తె బేబీ సత్యవాణి. కూచిపూడి నృత్యకారిణి. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తన ఆరో ఏట నుంచే టీవీలో సంప్రదాయ నృత్యం చేస్తూ కూచిపూడిపై ఆసక్తి పెంచుకుంది. రాజమహేంద్రవరం శ్రీ విజయ శంకర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ వద్ద నృత్యాన్ని అభ్యసించింది. బీకాం కంప్యూటర్స్ చదువుతూనే కూచిపూడిలో డిప్లమో చేసింది. 2019 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా 956 ప్రదర్శనలు ఇచ్చి 62 అవార్డులు పొందింది. కొత్తపేటలో శారదా కళాక్షేత్ర స్థాపించి 600 మందికి నాట్యంలో శిక్షణ ఇస్తోంది. ఆమె కీర్తి ప్రతిష్టలు తనకెంతో గర్వకారణం.
– రిటైర్డ్ ఉపాధ్యాయుడు రావి సోమయాజులు, కొత్తపేట
అమ్మ ఆశలు నెరవేర్చారు
తమ ఇద్దరు కుమార్తెలలో పెద్దమ్మాయి జయలక్ష్మి పటవల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా, చిన్న కుమార్తె ధనలక్ష్మి కందులపాలెం సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. పిల్లలిద్దరినీ ప్రయోజకులుగా చూడాలని తపించే వారి తల్లి సత్యవతి 2010లో క్యాన్సర్‌తో మృతి చెందారు. అమ్మ కలలను నెరవేర్చాలన్న ఆశయంతో 2012లో జయలక్ష్మి టీచర్‌గా, 2019లో ఏఎన్‌ఎంగా వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారి విజయం తనకెంతో ఆనందం.
– సత్యనారాయణ, దంగేరు,
కె.గంగవరం మండలం
ఇద్దరుకూతుర్లూ కానిస్టేబుళ్ళు..
తన ఇద్దరు కుమార్తెలు స్వాతి కల్యాణి, కుమారి 2017లో సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికై తన ఆశలు తీర్చారు. టైలరింగ్ చేస్తూ తన కుమార్తెలను ప్రయోజకులను చేయడానికి కష్టపడ్డాను. వారి ప్రతిభపై తనకెంతో నమ్మకం. తన కష్టాలు వారికి రాకూడదు. ఆ అక్క చెల్లెళ్లు సైతం వారు సాధించిన ప్రతిదీ తనదేనని చెప్తుంటారు. వారి నాన్న దూరం కావడంతో తన కష్టాన్ని అర్ధం చేసుకుని లక్ష్యాలను సాధించారు. తననెంతో ప్రేమగా చూసుకుంటారు.
– కుమార్తెలతో తల్లి పద్మ, అంగర,
కపిలేశ్వరపురం
నా కూతురు బంగారం
తమకు ఒక పాప, ఒక బాబు, పాప జస్విక 4వ తరగతి చదువుతోంది. మండపేటలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో రజతం, యానాంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తమకు ఎంతో గుర్తింపు తెచ్చింది.
– అశోక్, మణి
కుటుంబానికి వన్నె తెస్తున్నారు
తమ ఇద్దరు కుమార్తెలు బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయి పతకాలు ఎన్నో సాధించారు. పెద్దమ్మాయి హరిణి, చిన్నమ్మాయి హర్షిణి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం కన్నా తండ్రిగా ఆనందం ఏముంటుంది. క్రీడలతో తమ కుటుంబానికి వన్నెతెస్తున్న బంగారాలు నా పిల్లలు. – కె.చిన్నబ్బాయి


