ఫోన్‌లో పరామర్శించిన
మాజీ సీఎం వైఎస్ జగన్
ప్రత్తిపాడు రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు పితృవియోగం కలిగింది. ధర్మవరంలోని ఆయన స్వగృహంలో ఆయన తండ్రి ముదునూరి రామరాజు (87) శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి రామరాజు భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామరాజుకు భార్య, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ
మురళీకృష్ణంరాజు తండ్రి మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయన్ని పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


