వైభవంగా స్మార్త సభ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా స్మార్త సభ

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

అమలాపురం టౌన్‌: వేదం ఏం చేయాలో చెబితే స్మార్తం ఎలా చేయాలో చెబుతుందని తిరుపతి శ్రీవెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం డీన్‌ డాక్టర్‌ ముష్టి వేంకట నాగ పవనకుమార శర్మ అన్నారు. స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఆపస్తంబ పురోహిత పరిషత్‌ 26వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్త పర విద్వత్సభను నిర్వహించారు. తిరుపతి విద్యాలయం డీన్‌ డాక్టర్‌ దూవ్వూరి ఫణియజ్ఞేశ్వర ఘనపాఠి అధ్యక్షతన జరిగిన సభకు పవన కుమార శర్మ ముఖ్య అతిథి గా పలువురు పురోహితులు స్మార్తం విశిష్టతను వివరించారు. అమలాపురంలో ఉచిత స్మార్త, అపస్తంబ విద్యా పాఠశాలను ప్రారంభించినట్టు ఆకొండి పవన్‌ తెలిపారు. పరిషత్‌ అధ్యక్షుడు గొర్తి వెంకట కృష్ణ సత్యసాయి పాల్గొన్నారు.

బస్సు ఢీకొని

మహిళ దుర్మరణం

అమలాపురం టౌన్‌: విశాఖ మద్దిలపాలెం డిపో నుంచి అమలాపురం వస్తున్న ఆర్టీసీ సర్వీసు శనివారం కోనసీమ జిల్లా అమలాపురంలోని బుద్ధ విహార్‌ వద్ద మెయిన్‌ రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న కావూరి పుష్ప (25)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పుష్ప తన అన్నయ్య కావూరి చిన్నతో కలిసి ఆరు నెలల కిందట అమలాపురం వచ్చి చెత్త కాగితాలు ఏరుకుంటూ ఉపాధి పొందుతోంది. పుష్పకు వివాహం కాగా భర్తతో విడిపోయి అన్నయ్యతో ఉంటోంది. చెల్లెలు మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. అతడి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్‌ఆర్‌ కిశోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోంగార్డు

అనుమానాస్పద మృతి

నిడదవోలు: రాజమహేంద్రవరం టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న వేముల నాగార్జునుడు (39) స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం రైల్వేట్రాక్‌ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య రత్నకుమారితో పాటు 12 ఏళ్ల కుమార్తె ఉంది. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నాగార్జునుడు 2007లో హోంగార్డుగా చేరగా, భార్య రత్నకుమారి దుబాయ్‌లో ఉంటున్నారు. నాగార్జునుడును హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని బంధువులు, స్నేహితులు అనుమానిస్తున్నారు. రైల్వే ఇన్‌ఛార్జి ఎస్సై సుబ్రహ్మణ్యం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆస్పత్రి వద్ద నాగార్జునుడి బంధువులు అతడిది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. అతడి భార్య వచ్చే వరకు పోస్టుమార్టం చేయవద్దని, నిందితులను అరెస్టు చేయాలని వారు భీష్మించారు. ఎస్సై శ్రీహరి వారితో మాట్లాడి అతడి భార్య వర్చాక పోస్టుమార్టం చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement