బిక్కవోలు మండలం పందలపాకలో గణపతిని నిమజ్జనం చేస్తున్న భక్తులు
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ..
ప్రభుత్వ ఆస్పత్రితోపాటు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రులు, క్లినిక్‌లను కూడా వందల మంది తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలతో వచ్చే కుటుంబాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రద్దీ కనిపిస్తోంది. సాధారణ జ్వరంగా భావించి తొలుత ఇంటి వద్దే చికిత్స చేయించుకున్నప్పటికీ, జ్వరం రెండు, మూడు రోజులు కొనసాగడం లేదా దగ్గు, శ్వాస సమస్యలు కనిపించడంతో వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే అదునుగా అక్కడ ఆర్థికంగా దోచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రక్త పరీక్షల పేరిట భారీగా డబ్బులు గుంజేస్తున్నారని, సాధారణ చార్జీల కంటే రూ.300కు పైగా అదనంగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


